Tuesday, March 10, 2026
Homeసినిమాకొందరు డైరెక్టర్లు నన్ను వాడుకున్నారు: పాయల్

కొందరు డైరెక్టర్లు నన్ను వాడుకున్నారు: పాయల్

RX 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. RX 100 చిత్రంలో కార్తికేయకి జోడిగా ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. వీరిద్దరి కెమిస్ట్రీకి కుర్రకారు ఫిదా అయ్యారు. దీంతో పాయల్ పేరు టాలీవుడ్ లో మారుమోగింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరిర్ నాశనం కావడానికి కొందరు వ్యక్తులు కారణమని తెలిపింది. ఆర్ ఎక్స్ 100 తర్వాత కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కొందరు డైరెక్టర్లు తనని వాడుకున్నారని తెలిపింది. ప్రస్తుతం పాయల్ ‘మంగళవారం’ అనే మూవీతో రాబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular