Thursday, June 18, 2026
Homeసినిమాసందీప్‌ మాధవ్‌, కేథరిన్ కాంబో మూవీ ఫిక్స్

సందీప్‌ మాధవ్‌, కేథరిన్ కాంబో మూవీ ఫిక్స్

దర్శకుడు అశోక్‌ తేజ తెరకెక్కించిన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ ఎంతటి ఘన విజయం సాధించిందితో తెలిసిందే. ఆహా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ట్రెండింగ్‌లో నిలిచింది. గ్రామీణ నేపథ్యంలో మర్డర్‌ మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరించిన ఈ దర్శకుడు అశోక్‌ తేజ ఇప్పుడు యాక్షన్‌ థ్రిల్లర్‌కు శ్రీకారం చుట్టారు. కేథరిన్‌ త్రెసా కథానాయికగా, ‘జార్జిరెడ్డి’, ‘వంగవీటి’ చిత్రాలతో గుర్తింపు పొందిన సందీప్‌ మాధవ్‌ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కేసీఆర్‌ ఫిల్మ్స్‌, శ్రీ మహావిష్ణు మూవీస్‌ బ్యానర్ల పై ప్రొడక్షన్‌ నంబర్‌వన్‌గా ఇది రూపొందనుంది.

దావులూరి జగదీష్‌, పల్లి కేశవరావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూలై చివరి వారంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ చిత్రాన్ని చివరి వరకూ సస్పెన్స్‌ రివీల్‌ చేయకుండా ఎంతో గ్రిప్పింగ్‌గా రూపొందించిన అశోక్‌ తేజ యాక్షన్‌ థ్రిల్లర్‌ను అంతకు మించి అద్భుతంగా రూపొందిస్తారని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేథరిన్‌ స్టార్‌ హీరోయిన్‌ అయినా కథల ఎంపికలో ఆచితూచి అడుగేస్తుంటారు. కొత్త దర్శకుడితో కథ ఓకే చేసింది అంటే సినిమా పాయింట్‌ ఎంత ఆసక్తికరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular