Saturday, November 23, 2024
HomeTrending NewsCM Tour: వారి బకాయిలు మేం చెల్లిస్తున్నాం: పెద్దిరెడ్డి

CM Tour: వారి బకాయిలు మేం చెల్లిస్తున్నాం: పెద్దిరెడ్డి

హెరిటేజ్ కోసం చిత్తూరు విజయ డెయిరీని మూసివేసిన వారు డెయిరీ స్క్రాప్ లో గోల్ మాల్ జరిగిందని విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆరోపించారు.  చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు పర్యటించనున్నారు. చిత్తూరు  విజయ డెయిరీ వద్ద అమూల్ సంస్థ ఏర్పాటు చేస్తోన్న నూతన యూనిట్ కు శంఖుస్థాపన చేయనున్నారు, అనంతరం పోలీస్  పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.  ఆ తర్వాత చిత్తూరు మెడికల్ కాలేజ్ లో నిర్మించనున్న 300  పడకల ఆస్పత్రికి భూమి పూజ చేస్తారు.  సిఎం పర్యటన ఏర్పాట్లను  ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి టూర్ కోర్దినేటర్ తలశిల రఘురామ్, చిత్తూరు ఎంపి ఎన్ రెడ్డప్ప, చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, కలెక్టర్ శాన్ మోహన్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.

గత ప్రభుత్వం చిత్తూరు డెయిరీని మూసివేసిందని, వారు రైతులకు పెట్టిన 32  కోట్ల రూపాయల డెయిరీ బకాయిలను చెల్లిస్తున్నామని, ఇప్పటికే ఈ నిధులను జిల్లా కలెక్టర్ కు జమ చేశామని వెల్లడించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన 11 కోట్ల రూపాయలను త్వరలో అందిస్తామని హామీ ఇచ్చారు.  నిర్మాణంలో ఉన్న గవర్నమెంట్ ఫుడ్  ప్రాసెసింగ్ యూనిట్ ను వచ్చే సీజన్ నాటికి అందుబాటులోకి తెస్తామని,  రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. చిత్తూరు మెడికల్ కాలేజీలో ఆరోగ్యశ్రీ అమలు విషయాన్ని సిఎం జగన్ దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్