Thursday, March 12, 2026
HomeTrending NewsBJP: తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి

BJP: తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరును కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడి మార్పు జరుగుతోందని కొద్ది రోజులుగా వస్తున్న ఉహాగానాలు నిజమయ్యాయి.

కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. గంగాపురం కిషన్ రెడ్డి రెండేళ్ళు ఈ పదవిలో కొనసాగుతారు. అయితే ఎన్నికల సమయంలో బండి సంజయ్ ను మార్చటం…కిషన్ రెడ్డికి ఇవ్వటం పార్టీలో అంతర్గత కుమ్ములాటలను మరింత పెంచే అవకాశం ఉంది. ఈ ఇద్దరు నేతల మధ్య మొదటి నుంచి భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల వేల కిషన్ రెడ్డి కమలం సేనను ఏ విధంగా కలుపుకుని పోతారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular