Friday, March 13, 2026
Homeసినిమావిజయ్ 'లియో'లో చరణ్.. అసలు నిజం ఇదే.

విజయ్ ‘లియో’లో చరణ్.. అసలు నిజం ఇదే.

విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో భారీ చిత్రం రూపొందుతోంది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ కు జంటగా త్రిష నటిస్తుంది. మాస్టర్ సినిమా తర్వాత విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో లియో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ భారీ చిత్రాన్ని అక్టోబర్‌ 19న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

అయితే.. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో మరింత ప్రచారం ఊపందుకుంది. చరణ్, లోకేష్ కనకరాజ్ కలిసి ఉన్న ఫోటో బయటపడడంతో నిజంగానే లియోలో చరణ్‌ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. దీంతో లియోలో చరణ్ గెస్ట్ రోల్ చేయడం అనేది నిజమా..? లేక ఇది గ్యాసిప్పా అనేది ఆసక్తిగా మారింది.ఇంతకీ వాస్తవం ఏంటని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే.. ప్రచారంలో ఉన్నది నిజం కాదని తేలింది.

చరణ్, లోకేష్ కనకరాజ్ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు. అయితే.. చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలో బిజీగా ఉన్నాడు. లోకేష్ కనకరాజ్ లియో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వీరిద్దరూ ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత కలిసి సినిమా చేయనున్నారు. 2024 లేదా 2025లో చరణ్, లోకేష్ కనకరాజ్ కాంబో మూవీ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular