Sunday, November 3, 2024
HomeTrending Newsకాంగ్రెస్, బీఆర్ఎస్ ల డీఎన్ఏ ఒక్కటే - కిషన్ రెడ్డి

కాంగ్రెస్, బీఆర్ఎస్ ల డీఎన్ఏ ఒక్కటే – కిషన్ రెడ్డి

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టు.. బీఆర్ఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ కు వేసినట్టేనని .. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు కిషన్ రెడ్డి. హైదారబాద్ సిటీ బీజేపీ ఆఫీస్ లో తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి మయమైందన్నారు. అన్ని రంగాల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా వైఫల్యం అయ్యిందన్నారు. కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా అధికారం చేతిలో పెట్టుకుని రాష్ట్రాన్ని మోసం చేస్తోందని విమర్శించారు.

పథకం ప్రకారం సోషల్ మీడియాలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో పొత్తులు పెట్టుకుంది కాంగ్రెస్ , బీఆర్ఎస్ మాత్రమే. మేం ఎప్పుడు బీఆర్ఎస్ తో కలవలేదు. దీనిని ప్రజలు అర్ధం చేసుకోవాలి. ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు. ప్రధాని స్వయంగా కుటుంబ పాలన పోవాలని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. గతంలో అధికారం పంచుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ కు బీజేపీని విమర్శించే హక్కు లేదు. ఎట్టిపరిస్థితుల్లో ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉండేందుకు వీల్లేదన్నారు కిషన్ రెడ్డి.

ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వందలాది మంది తెలంగాణ బిడ్డలు అమరవీరులు బలిదానం చేస్తే.. సకల జనులు కీలక పాత్ర పోషిస్తే.. ఇప్పుడు కుటుంబం చేతిలో రాష్ట్రం బంధీ అయ్యింది. తెలంగాణ సమాజం ఇప్పుడు ఆలోచన చేస్తోంది. బంధీ అయిన తెలంగాణకు స్వేచ్ఛా, స్వాతంత్రం కల్పించాలి. తెలంగాణ ఉద్యమ కారులు, అమరవీరులు, ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు ఇక్కడ పాలన ఉండాలి. ప్రస్తుతం నిజాం తరహా పాలన సాగుతోంది..దీనికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతోంది.

“8వ తేదీని వరంగల్ లో ప్రధాని మోదీ భహిరంగ సభను విజయవంతం చేయాలి. ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 150 ఎకరాల స్థలంలో రైల్ వ్యాగన్ ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు భూమి పూజ చేస్తారు. రైలు వ్యాగన్లు సంవత్సరానికి 2400 కేపాసిటి తో తయారు చేస్తారు. నెలకు 200 వ్యాగన్ల తయారీ కెపాసిటీ ఉంటుంది. మొదటి ఫేజ్ లో కేంద్రం వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం రూ.521 ఖర్చు పెట్టబోతోంది. వివిధ జాతీయ రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. 1 లక్ష 20 కోట్ల రూపాయలకు పైగా జాతీయ రహదారుల అభివృద్ధికి ఖర్చు చేశారు. రూ. 550 కోట్ల అభివృద్ధి పనులకు 8వ తేదీన ప్రధాని శంకుస్థాపన చేస్తారు” అని కిషన్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్