కాళేశ్వరం నీళ్లు వరద కాలువ ద్వారా ముప్కాల్ పంప్ హౌజ్ కు (పోచంపాడ్ ప్రాజెక్ట్) చేరుకున్న నేపధ్యంలో కాళేశ్వరం జలాలను ఆహ్వానిస్తూ పలు పాయింట్ల దగ్గర రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం రైతులతో కలిసి పూజలు నిర్వహించారు.
ఉదయం కమ్మర్పల్లి బ్రిడ్జ్ దగ్గర కమ్మర్పల్లి, నాగపూర్,ఉప్లూర్,ఏర్గట్ల గ్రామాల రైతులతో,అనంతరం తిమ్మాపూర్ బ్రిడ్జ్ వద్ద తిమ్మాపూర్,మోర్తాడ్ పార్ట్(బద్దం వాడ),పాలెం బ్రిడ్జ్ వద్ద పాలెం,గాండ్లపెట్,గాంధీవాడ మోర్తాడ్ గ్రామాలు,దోన్కల్ బ్రిడ్జ్ వద్ద దోన్కల్,ధర్మోరా,షెట్పల్లి గ్రామాలు,పోచం పల్లి బ్రిడ్జ్ వద్ద అంక్సాపూర్,పోచంపల్లి గ్రామాలు,పడగల్ బ్రిడ్జ్ వద్ద పడగల్, వన్నెల్ బి గ్రామాలు, బోదెపల్లి బ్రిడ్జ్ వద్ద బోదెపల్లి,బాల్కొండ,చిట్టాపూర్ గ్రామాలు,కిసాన్ నగర్ బ్రిడ్జ్ వద్ద వెంపల్లి,కిసాన్ నగర్ ,ముప్కాల్,బస్సాపూర్ బ్రిడ్జ్ వద్ద బస్సాపూర్, నాగపూర్, ఇత్వార్ పెట్ గ్రామాల రైతులు ప్రజలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి సీఎం కేసిఆర్ కు దన్యవాదాలు తెలిపారు.