Monday, September 23, 2024
Homeసినిమాకార్తికేయ 'బెదురులంక 2012' రిలీజ్ డేట్ ఫిక్స్

కార్తికేయ ‘బెదురులంక 2012’ రిలీజ్ డేట్ ఫిక్స్

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘బెదురులంక 2012’. కార్తికేయకు జంటగా నేహా శెట్టి నటించింది. ఈ చిత్రాన్ని లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. ‘బెదురులంక 2012’ చిత్రాన్ని ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఈ రోజు వెల్లడించారు.

చిత్ర నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ ..”అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది. కొత్త కంటెంట్, బ్యూటిఫుల్ విజువల్స్, మంచి పాటలతో మేం ‘బెదురులంక 2012’ తీశాం. ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళుతుందీ సినిమా. ఇప్పటి వరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా ఉంటుంది. గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా అంటే ‘బెదురులంక 2012’ ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది” అన్నారు.

దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ… ”ఇప్పటికే విడుదలైన టీజర్, పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకులు అందరూ సినిమా విడుదల ఎప్పుడు? ఎప్పుడు? అని అడుగుతున్నారు. ఆగస్టు 25న ‘బెదురులంక 2012’ ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపిస్తాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలో ట్రైలర్ విడుదల తేదీ వెల్లడించడంతో  పాటు మిగతా పాటలను విడుదల చేస్తాం. మణిశర్మ గారు అద్భుతమైన బాణీలు అందించారు. పాటల్లోనూ, సన్నివేశాల్లోనూ కార్తికేయ, నేహా జోడీ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్