Wednesday, June 17, 2026
HomeTrending Newsదర్శి బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భాంతి

దర్శి బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భాంతి

ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురికావడంపై ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌ మోహన్ రెడ్డి తీవ్ర  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లిబృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఎన్‌సీపీ కాల్వలో పడిపోయిందని, ఈ ఘటనలో 7 గురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసు సిబ్బంది సహా ఇతర అధికారులు వెళ్లారని, సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ మల్లికా గార్డ్ సందర్శించారు. ప్రమాదంపై ఆరా తీశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular