ఇప్పటిదాకా సిఎం జగన్ ను చూస్తేనే పవన్ కు వణుకు అనుకున్నామని, కానీ వాలంటీర్లను చూసినా పవన్‌కి వణుకే అని అర్ధమైందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. దత్తపుత్రుడైన ఇరిటేషన్ స్టార్ మూడు రోజులుగా నోటికి అడ్డూ అదుపూ లేకుండా వాలంటీర్లను, మహిళలను, ముఖ్యమంత్రిని గౌవరం లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడారు. వాలంటీర్లపై పిచ్చివాగుడు వాగితే పళ్ళు రాలగొడతారంటూ ఘాటుగా హెచ్చరించారు. వాలంటీర్ వ్యవస్థ వెంట్రుక కూడా పీకలేవు పవన్ అంటూ మండిపడ్డారు. కొవిడ్ లో జనసైనికులు సైతం వాలంటీర్ల సేవలు పొందినవారేనని అన్నారు.
రోజా ప్రెస్ మీట్ లో ముఖ్యాంశాలు
- వాలంటీర్ల కాళ్ళు కడిగి పవన్ క్షమాపణలు చెప్పాలి. లేదంటే ఆయన సంగతి అదే వాలంటీర్లు తేల్చేస్తారు.
- వార్డు మెంబరు కూడా కాని పవన్ కు కేంద్ర నిఘాసంస్థలు రిపోర్టు ఇచ్చాయా..?
- మిస్సింగ్ కు.. హ్యూమన్ ట్రాఫికింగ్ కు తేడా తెలుసుకో..!
- మిస్సింగ్ కేసుల్లో టాప్ టెన్ స్టేట్స్‌లో ఏపీ లేనే లేదు.
- తెలంగాణ ఆరో స్థానంలో ఉంది.. కేసీఆర్‌ను నీలదీయగలవా..?
- నీ దత్తడాడీ హయాంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ పై నోరెందుకు తెరవలేదు..?
- నీ తల్లిని తిట్టిని వాళ్ళను గెలిపించమని అడగటానికి సిగ్గు ఎక్కడ లేదు?
- దమ్ముంటే ఏకవచనంతో పిలవడం కాదు.. జగన్ అన్నతో సింగిల్‌గా పోటీ చెయ్..
- గోదావరి జిల్లాల్లో వరదలొస్తే నువ్వు, నీ దత్తడాడీ ఎక్కదున్నారు?
- ఆ వాలంటీర్లే పీకల్లోతు నీళ్లల్లో దిగి సరుకులు అందించారు.
- ఇది సమాంతర వ్యవస్థ కాదు.. ప్రజలకు సేవ చేస్తోన్న గొప్ప శక్తి
- స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఈ వ్యవస్థ ప్రతి కుటుంబాన్ని సొంత కుటుంబంగా భావించి సేవలు అందిస్తోంది.
- ఒక్క రూపాయి లంచం లేకుండా ప్రభుత్వ పథకాలను, సేవలను ప్రజల ముంగిటకు వచ్చేలా వారు పనిచేస్తున్నారు.
- కరోనా సమయంలో దేశంలోనే బెస్ట్ సర్వీసెన్‌ను వాలంటీర్ల ద్వారా అందిస్తే కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు జగన్ గారిని శెభాష్ అన్నాయి.
- దీంతో చంద్రబాబుకు వాలంటీర్ వ్యవస్థ అంటే ఏంటో అర్ధం అయింది.
- అందుకే తాను అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాను అంటూనే, మరోవైపు తన దత్తపుత్రుడితో విషం చిమ్మిస్తున్నాడు.
- పవన్ మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలే. రాష్ట్రంలో 15వేలకు పైగా సచివాలయాలు ఉంటే అందులో 2.60 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు.
- అందులో 70 శాతం మంది అంటే 1.80 లక్షల మంది మహిళలే. మహిళలే మహిళలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడానికి ఈ ఉద్యోగం ఎంచుకున్నారా అని పవన్ కల్యాణ్ ను ప్రశ్నిస్తున్నా.
- 2024లో జగనన్న వన్స్‌మోర్.. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా.. బైబై బీపీ(బాబు-పవన్) అని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
- ఇకనైనా ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తున్నా.