వరుణ్ తేజ్ కొత్త చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పక్కా యాక్షన్ మోడ్‌లో ఆకట్టుకోబోతున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవటంలో బిజీగా ఉంది. ఆగస్ట్ 25న సినిమాను విడుదల చేస్తున్నారు.
ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే.. వరుణ్‌తేజ్ మునుపెన్నడూ చేయనటువంటి భారీ యాక్షన్ సన్నివేశాల్లో నటించినట్లు స్పష్టమవుతుంది. ఆ యాక్షన్ సన్నివేశాలను చూస్తుంటే.. మహాభారతంలోని అర్జునుడి రథంలోని ఆశ్వాల శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా ఉంది. అర్జునుడి రథం, ఓ పాత కారుని ప్రీ టీజర్‌లో గమనించవచ్చు. దాన్ని కంటిన్యూ చేస్తూ కొన్ని యాక్షన్ సన్నివేశాలను ఫ్లాషస్ రూపంలో చూపించారు. చివరగా ఓ రైఫిల్ పట్టుకుని పొగలో ఎంట్రీ ఇస్తారు. ఈ సీన్ కచ్చితంగా థియేటర్‌లోని ఆడియెన్స్‌కు ఓ విందులా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
వరుణ్‌తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా.. యూరోపియన్ దేశాలతో పాటు యు.ఎస్.ఎలోనూ షూటింగ్‌ను హ్యూజ్ బడ్జెట్‌తో ఎస్వీసీసీ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బాపినీడు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ముఖేష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని, అవినాష్ కొల్ల ఆర్ట్ వర్క్‌ను అందిస్తున్నారు.