Tuesday, March 10, 2026
Homeసినిమానాగ్ తో అనిల్ రావిపూడి సినిమా ప్లాన్ జరుగుతుందా..?

నాగ్ తో అనిల్ రావిపూడి సినిమా ప్లాన్ జరుగుతుందా..?

నాగార్జున ది ఘోస్ట్ సినిమా తర్వాత ఇంత వరకు కొత్త సినిమా ప్రకటించలేదు. అసలు గ్యాప్ లేకుండా సినిమాలు చేసే నాగార్జున సడన్ గా ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు అంటున్నారు అభిమానులు. రైటర్ బెజవాడ ప్రసన్నను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయాలి అనుకున్నారు. అయితే.. ఆ సినిమా బడ్జెట్ విషయంలో.. ప్రసన్నకు క్లారిటీ లేకపోవడం.. ట్రైయల్ షూట్ ను సరిగా చేయలేకపోవడం.. వలన ప్రసన్న నుంచి కథను మాత్రమే తీసుకుని దర్శకత్వ బాధ్యతలను మాత్రం వేరే వాళ్లకు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట.

అజయ్ భూపతి దర్శకత్వంలో నాగార్జున సినిమా చేయాలి అనుకుంటున్నారని టాక్ వచ్చింది. ఈ సినిమాని త్వరలో ప్రకటిస్తారు అనుకుంటే.. ఇప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి పేరు తెర పైకి వచ్చింది. ఇటీవలే అనిల్ రావిపూడి  అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జునతో సమావేశమైనట్లు తెలిసింది. ఇద్దరి మధ్య స్టోరీకి సంబంధించి డిస్కషన్ కి జరిగిందని సమాచారం. హిలేరియస్ ఎంటర్ టైనర్లకు పెట్టింది పేరులా అనిల్ రావిపూడి దూసుకెళుతున్నాడు. కామెడీ రోల్స్ రాయడం ఆయనకు కొట్టిన పిండి. ఎలాంటి హీరోతోనైనా అద్భుతమైన కామెడీ పండించగలడు.

నాగార్జున కూడా అనిల్ తో కింగ్ సైజ్ లో కామెడీ ఎంటర్ టైనర్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా?  అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. హాలో బ్రదర్, కింగ్ తర్వాత నాగార్జున నుంచి హిలేరియస్ ఎంటర్ టైనర్ రాలేదు. ఇప్పుడు అలాంటి సినిమా చేయాలి అనుకుంటున్నారట. గతంలో కూడా నాగ్ తో అనిల్ సినిమా అంటూ వార్తలు వచ్చాయి. అలాగే అఖిల్ తో అనిల్ రావిపూడి సినిమా అని కూడా ప్రచారం జరిగింది. మొత్తానికి అన్నపూర్ణ కాంపౌండ్ లో అనిల్ రావిపూడి సినిమా చేయడం అయితే కన్ ఫర్మ్ అంటున్నారు. అయితే.. అది నాగార్జునతో ఉంటుందా..? నాగచైతన్య లేదా అఖిల్ తో ఉంటుందా..? అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular