Saturday, September 21, 2024
Homeసినిమామహేష్‌, రవితేజలతో పోటీకి సై అంటున్న విజయ్ దేవరకొండ

మహేష్‌, రవితేజలతో పోటీకి సై అంటున్న విజయ్ దేవరకొండ

సంక్రాంతి సీజన్ వచ్చిందంటే టాలీవుడ్ కి పండగ అని చెప్పాలి. ఈ సమయంలో స్టార్ హీరోలు అందరూ తమ సినిమాలని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఆ సమయంలో థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద సినిమాలు అన్ని కూడా సంక్రాంతి సీజన్ లో విడుదల చేయాలని ప్రయత్నిస్తుంటారు. సంక్రాంతి సీజన్ లో సినిమా రిలీజ్ చేస్తే.. బాక్సాఫీస్ దగ్గర భారీగా లాభాలు వస్తాయి. ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి, తమిళ హీరో విజయ్ వారసుడు సినిమాలు హిట్ అయ్యాయి. అజిత్ తెగింపు కూడా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.

వచ్చే సంవత్సరం కోసం ఇప్పటి నుంచే డేట్స్ లాక్ చేస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల విషయానికి వస్తే.. మహేష్‌ బాబు నటిస్తున్న గుంటూరు కారం సంక్రాంతికి వస్తుందని ప్రకటించారు. రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈగల్ మూవీకి కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్. ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అలాగే తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కలిసి చేస్తున్న హనుమాన్ మూవీని కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నామని ప్రకటించారు.

సంక్రాతికి ప్రభాస్ ప్రాజెక్ట్ కే మూవీ వస్తుందని ప్రకటించారు. అయితే.. ఈ సినిమా వాయిదా పడిందని టాక్. ఈ నెల 20న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది అపిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సంక్రాంతి పోటీలోకి విజయ్ దేవరకొండ వచ్చారు. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఈ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లిస్ట్ లో చిరంజీవి, కళ్యాణ్ కృష్ణతో చేసే సినిమా కూడా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే.. సంక్రాంతికి వచ్చేసరికి ఇప్పటి వరకు లిస్ట్ లో ఉన్న సినిమాల్లో కొన్ని తప్పుకోవచ్చు.. మరికొన్ని లిస్ట్ లో చేరచ్చు. మొత్తానికి అయితే.. రానున్న సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర మాత్రం రసవత్తరమైన పోటీ ఖాయం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్