Friday, March 20, 2026
Homeసినిమామీనాక్షి చౌదరి కి అదృష్టం కలిసొచ్చినట్టే!

మీనాక్షి చౌదరి కి అదృష్టం కలిసొచ్చినట్టే!

టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన బ్యూటీలలో మీనాక్షి చౌదరి ఒకరు. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే చాలా చిన్న సినిమాతో ఆమె టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సుశాంత్ జోడీగా కలిసి నటించిన ఆమె అడివి శేష్ తో ‘హిట్ 2’ .. రవితేజతో ‘ఖిలాడి’ సినిమాల్లో అవకాశాలను అందుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ఇప్పుడు నేరుగా మహేశ్ బాబు జోడీగా ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తుండటం విశేషం.

నిజానికి టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్స్ మధ్య గట్టి పోటీ ఉంది. స్టార్ హీరోయిన్స్ ను దాటుకుని, మీడియం రేంజ్ హీరోయిన్స్ దగ్గరికి ఒక పెద్ద సినిమా రావాలంటే చాలా కష్టంగా మారింది. ఒక వైపు నుంచి బాలీవుడ్ .. మరో వైపు నుంచి మల్లూ ఉడ్ .. ఇంకో వైపు నుంచి కోలీవుడ్ బ్యూటీలు ఎప్పటికప్పుడు రంగంలోకి దిగిపోతున్నారు. ఇటు చూస్తే మీనాక్షి ఇంకా తెరపై కుదురుకునే పరిస్థితుల్లోనే ఉంది. అలాంటి ఆమెకి మహేశ్ బాబు సినిమాలో ఛాన్స్ దక్కడం మామూలు విషయమేం కాదు.

మహేశ్ బాబు సినిమాలో చేయడం ఒక ఎత్తయితే, త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడం మరో ఎత్తు. ఆ రెండు అవకాశాలను ఒక్కసారిగా అందుకున్న హీరోయిన్స్ జాబితాలో మీనాక్షి కూడా నిలిచింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే, ఆమె కెరియర్లో ఇదే పెద్ద సినిమా. ఇటీవలే ‘గుంటూరు’ మిర్చి యార్డులో జరిగిన షెడ్యూల్లో ఆమె పాల్గొంది కూడా. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా హిట్ అయితే మీనాక్షి చౌదరికి అదృష్టం కలిసొచ్చినట్టేనని అనుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular