Tuesday, June 16, 2026
Homeసినిమాచైతన్య మరో సినిమాకి ఓకే చెప్పారా..?

చైతన్య మరో సినిమాకి ఓకే చెప్పారా..?

అక్కినేని నాగచైతన్య కస్టడీ సినిమాతో చేసిన మాస్ యాక్షన్ మూవీ  ప్రయత్నం ఫలించలేదు. వెంకట్ ప్రభు తెరకెక్కించిన చిత్రం పై చైతన్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ.. ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పించలేకపోయింది. అందుకనే ఈసారి కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. నెక్ట్స్ మూవీని చుందూ మొండేటితో చేస్తున్నాడు. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురానున్నారు.

విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందే ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి కానీ.. ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. అలాగే అనుపమ పరమేశ్వరన్ నటించే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ మూవీని అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. అయితే.. చందూతో చేసే సినిమా తర్వాత చైతూ సినిమా ఎవరితో అంటే.. శివ నిర్వాణ పేరు వినిపిస్తోంది. చైతన్య, శివ నిర్వాణ కాంబినేషన్లో రూపొందిన చిత్రం మజిలీ. ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది.

దీంతో చైతన్య, శివ నిర్వాణ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. చైతన్య, శివ నిర్వాణ వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడం వలన కుదరలేదు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయ్యిందని తెలిసింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఇది చైతన్య కెరీర్ లో 25వ చిత్రమని.. ఈ చిత్రాన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఖుషి సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత నుంచి శివ నిర్వాణ.. చైతన్యతో చేయనున్న మూవీ వర్క్ చేస్తాడు. ఈ మూవీని డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయనున్నారని  సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular