Saturday, November 23, 2024
HomeTrending NewsGovt Schools: పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Govt Schools: పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియామకం చేపట్టి, బోధన కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా కు మంగళవారం కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. ఉపాధ్యాయుల నియమాకంలో జాప్యంతోపాటు తాత్కాలికంగానైనా కూడా ఉపాధ్యాయులను నియమించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో సంబంధిత సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో విద్యాబోధన అందని పరిస్థితి నెలకొందన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపు లేకపోవడంతో రాజ్యాంగంలో పేర్కొన్న నిర్భంద ఉచిత విద్య విద్యార్థులకు అందని పరిస్థితి నెలకొందన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో 150 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, పొలాస ఉర్దూ మీడియం పాఠశాలకు నాలుగేళ్లుగా సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్ పోస్టులు కేటాయించకపోవడంతో విద్యార్థులు చదువులో వెనకబడే ప్రమాదం ఏర్పడిందన్నారు.

ఈ క్రమంలో విద్యార్థుల బోధన కోసం ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో నిధులు సమకూర్చి, తాత్కాలిక ప్రాతిపదికన సంబంధిత బోధనా ఉపాధ్యాయులను నియమించుకుని, వేతనాలు చెల్లిస్తూ, రెండేళ్లపాటు బోధన కొనసాగించారని వెల్లడించారు.ఈ ఏడాది ముస్లిం కమిటీలో నిధుల కొరతతో బోధకులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయులను నియమించుకోకపోవడంతో, పాఠశాలలో సంబంధిత సబ్జెక్టులు బోధించేందుకు ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో బోధన అందని పరిస్థితి నెలకొందన్నారు. బోధకుల కొరతతో ఉర్దూ మీడియం విద్యార్థులు చదువులో వెనకపడకుండ, ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండ, సబ్జెక్టుల బోధన సవ్యంగా సాగేలా తగిన చర్యలు చేపట్టాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన లేఖలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్