Saturday, November 23, 2024
Homeసినిమాపవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అదే నేర్చుకున్నాను - ప్రియా ప్రకాష్ వారియర్

పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అదే నేర్చుకున్నాను – ప్రియా ప్రకాష్ వారియర్

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ముఖ్యపాత్రలు పోషించారు.ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన ప్రియా ప్రకాష్ వారియర్.. బ్రో సినిమాకి సంబంధించిన చెప్పిన పలు ఆసక్తికర విషయాలు ఆమె మాటల్లోనే..

మా అమ్మ చెప్పడంతో నేను అప్పటికే బ్రో మాతృక వినోదయ సిత్తం చూశాను. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. బ్రో కోసం సముద్రఖని గారు ఫోన్ చేసి లుక్ టెస్ట్ కోసం రమ్మన్నారు. ఆ పాత్ర కోసం ఎందరో పేర్లు పరిశీలించి, చివరికి నన్ను ఎంపిక చేశారు సముద్రఖని గారు. నాలాంటి నూతన నటికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో భాగమయ్యే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అలాంటి అగ్ర నటులతో ఒకట్రెండు సన్నివేశాల్లో నటించడమే నాలాంటి వారికి గర్వంగా ఉంటుంది. కెరీర్ ప్రారంభంలోనే పవన్ కళ్యాణ్ గారి లాంటి లెజెండరీ నటుడితో కలిసి నటించే అవకాశం రావడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను. సినిమాలో ఆయన కాంబినేషన్ లో నాకు సన్నివేశాలు ఉన్నాయి. ఆయన తన నటనతో మ్యాజిక్ చేస్తారు. ఆయన సెట్ లో అడుగుపెడితేనే ఏదో అనుభూతి కలుగుతుంది. అది మాటల్లో చెప్పలేము.

చాలా మంది అడుగుతుంటారు ఒక్క వీడియోతోనే బాగా పాపులర్ అయ్యారు. అలాంటి సరైన సినిమాలు ఎందుకు చేయడం లేదు అని.. దీనికి కారణం ఏంటంటే.. నాది సినిమా నేపథ్యమున్న కుటుంబం కాదు. నన్ను సరైన మార్గంలో గైడ్ చేసేవాళ్ళు లేరు. ఆ వీడియో తర్వాత అందరూ రకరకాల సలహాలు ఇవ్వడంతో కొన్ని సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాను. ఇప్పుడు ఈ ప్రయాణంలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు పాత్రలు, సినిమాల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకోగలుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు గొప్ప నటి కావాలని ఆశ ఉండేది. ఆ దిశగానే నా అడుగులు సాగుతున్నాయి.

మాతృకతో పోలిస్తే బ్రో సినిమాలో చాలా మార్పులు చేశారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే భారీతనం ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే అవసరమైన మార్పులు ఎన్నో చేశారు. కొన్ని ఆసక్తికరమైన కొత్త సన్నివేశాలు చేర్చారు. ముఖ్య పాత్రల నిడివి పెరిగింది.పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో నాకు మరీ ఎక్కువ సన్నివేశాలు లేవు. ఆయన చాలా కామ్ గా ఉంటారు కానీ.. ఆయన సెట్స్ లో అడుగుపెడితే మాత్రం అందరిలో ఉత్సాహం వస్తుంది. ఆయన ఆస్థాయికి చేరుకున్నా కానీ.. చాలా జెంటిల్ గా ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది ఆయన నుంచి నేర్చుకున్నాను.

తెలుగు సినిమాల బడ్జెట్, మార్కెట్ చాలా పెద్దది కానీ.. మలయాళంలో ఎక్కువగా కంటెంట్ ఓరియెంటెడ్ లో చిన్న సినిమాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు తెలుగు, మలయాళం అనే తేడా లేకుండా ఇండియన్ సినిమా అంటున్నారు. మన సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు భాషతో సంబంధంలేదు. భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలు చేయాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్