Sunday, September 22, 2024
HomeTrending NewsIrrigation: 'పోలవరం' మళ్ళీ దారిలో పెడతాం: బాబు

Irrigation: ‘పోలవరం’ మళ్ళీ దారిలో పెడతాం: బాబు

పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక ఆస్తి అని, రాష్ట్ర ప్రజల కల అని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అన్నారు.  దీని ద్వారా 7.2 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు, 23.50 లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేయవచ్చని, 28.50 లక్షల మందికి తాగునీరు అందించవచ్చని,  960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో పాటు వాటర్ టూరిజం కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు.  50 లక్షల క్యూసెక్కుల నీటి కోసం నదిని డైవర్ట్ చేయవచ్చని అన్నారు.  అలాంటి ఈ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందన్నారు. మంగళగిరిలోని  తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో  చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ పై  పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోలవరానికి జగనే శని అని ఈ శని పొతే తప్ప ఈ ప్రాజెక్టు పూర్తి కాదని వ్యాఖ్యానించారు.

ఐదేళ్ళ కాలంలో 11,537 కోట్ల రూపాయలు తాము ఖర్చు పెట్టి 72శాతం పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం 4,611 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. 45.72 మీటర్లకు తాము ఆమోదం తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం 41.15 మీటర్ల ఎత్తుకు అంగీకరించిందని విమర్శించారు.  55, 548 కోట్ల రూపాయలకు తాము ఆమోదం తెచ్చామన్నారు. తమ హయంలో 72 శాతం పూర్తి చేస్తే, ఈ ప్రభుత్వం కేవలం 5 శాతం మాత్రమే చేయగలిగిందని చెప్పారు.  నిర్వాసితులకు ఎకరానికి రూ. 19 లక్షలు  ఇస్తామని హామీ  ఇచ్చి మోసం చేశారని,  వారికోసం రూ.1890 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు.

వరదల సమయంలో ముంపు మండలాల ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారని, వారి ఆవేదన చూసి ముంపు మండలాలు కలుపుతూ ఓ ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చామని చెప్పారు. ఒకనాడు ఈ ప్రాజెక్టు పర్యాటక ప్రాంతంగా ఉంటే, ఇప్పుడు నిషేధిత ప్రాంతంగా తయారు చేశారన్నారు. పోలవరం ఏమైనా పాకిస్తాన్ లో ఉందా అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ కంట్రాక్టర్ ను మార్చొద్దని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్పినా వినకుండా అహంకారంతో నిర్ణయం తీసుకున్నారని, రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో తన కేసుల కోసం పోరాదలేదని, రాష్ట్రం కోసమేనని బాబు స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చి మళ్ళీ ఈ ప్రాజెక్టును దారిలో పెడతామని, నిర్దిష్ట కాలపరిమితిలోగా దీన్ని పొర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్