వైవిధ్యమైన కంటెంట్‌ను పలు భాషల్లో అందిస్తూ తనదైన మార్క్ క్రియేట్ చేసి దూసుకెళ్తోన్న డిజిటల్ మాధ్యమం జీ 5 అందించిన సరికొత్త మల్టీస్టారర్ తెలుగు వెబ్ ఒరిజినల్ ‘మాయాబజార్ ఫర్ సేల్’. సీనియర్ నరేష్, నవదీప్, ఈషా రెబ్బా, హరి తేజ, రవివర్మ, తరుణ్ భాస్కర్ తదితరులు నటించారు. సెటైరికల్ డ్రామాగా ‘మాయాబజార్ ఫర్ సేల్’ వెబ్ సిరీస్ రూపొందింది. జీ 5తో పాటు రానా దగ్గుబాటికి సంబంధించిన స్పిరిట్ మీడియా బ్యానర్ కలిసి సునిశితమైన, హృద్యమైన డ్రామాగా మాయాబజార్ ఫర్ సేల్‌ను రూపొందించారు. ఇదొక గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. గౌతమి చిల్లగుల్ల దర్శకత్వం వహించారు.
గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన ఈ వెబ్ ఒరిజినల్ జీ5లో ప్రేక్షకుల ఆదరణతో దూసుకెళ్తూ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసింది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యానర్ రూపొందించిన తొలి వెబ్ సిరీస్ ‘మాయాబజార్ ఫర్ సేల్’కు అమేజింగ్ రెస్పాన్స్ రావటం పై ఎంటైర్ టీమ్ చాలా హ్యాపీగా ఉన్నారు.
ఈ సందర్భంగా జీ 5 చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీష్ కల్రా మాట్లాడుతూ… ‘‘‘మాయాబజార్ ఫర్ సేల్’ సిరీస్‌కు అతి కొద్ది సమయంలోనే చాలా మంచి రెస్పాన్స్ రావటం సంతోషంగా ఉంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల అద్భుతమైన వర్క్ కారణంగా ఈ రిజల్ట్ వచ్చింది. భవిష్యత్తులోనూ ఇంత మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తాం’’ అన్నారు.