Sunday, January 19, 2025
Homeసినిమా‘మహా సముద్రం’ నుంచి హే రంభ సాంగ్ రిలీజ్

‘మహా సముద్రం’ నుంచి హే రంభ సాంగ్ రిలీజ్

యువ హీరోలు శర్వానంద్ – సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న చిత్రం మహా సముద్రం. ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి హే రంభా… అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు.

‘ఓ రంభా రంభా హే రంభా హే రంభా.. ఎక్కడే గుడుంబా’ అంటూ సాగే ఈ సాంగ్‌కి ప్రముఖ గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించగా… చైతన్ భరద్వాజ సంగీతం అందించారు. శర్వానంద్, జగపతి బాబు లపై చిత్రీకరించిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. వైజాగ్ బీచ్‌లో చిత్రీకరించిన ఈ సాంగ్‌లో సీనియర్ హీరోయిన్ రంభ ఫ్లెక్సీలు.. కటౌట్లు.. అదనపు ఆకర్షణగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రంభతో కలిసి నటించిన జగపతిబాబుపై ఈ పాటను చిత్రీకరించడం విశేషం.

ఈ పాట మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్