Monday, March 16, 2026
Homeసినిమాత్వరలో 'స‌ర్కారు వారి...' మాస్ పాట

త్వరలో ‘స‌ర్కారు వారి…’ మాస్ పాట

Now Mass Sarkar: సూపర్ స్టార్ మహేష్ బాబు, గీత గోవిందం ఫేమ్ ప‌ర‌శురామ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌ర్కారు వారి పాట‌. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తుంది. మాస్ అండ్ స్టైలీష్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతోన్న స‌ర్కారు వారి పాట కోసం మ‌హేష్ అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన స‌ర్కారు వారి పాట క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇప్పుడు మేలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి క‌ళావ‌తి అనే సాంగ్ రిలీజ్ చేయ‌డం.. ఈ సాంగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం తెలిసిందే. క‌ళావ‌తి అనే క్లీన్ మెలోడి సాంగ్ తో మెప్పించిన మేక‌ర్స్ ఇప్పుడు ప‌క్కా మాస్ ట్యూన్ ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ త‌మ‌న్ క‌న్ ఫ‌ర్మ్ చేశారు. లేటెస్ట్ గా త‌మ‌న్, దర్శకుడు పరశురామ్ మరియు గీత రచయిత అనంత్ శ్రీరామ్ లతో కలిసి ఉన్న ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి మాస్ అంటూ ట్వీట్ చేశారు. త‌మ‌న్ ఇలా ట్వీట్ చేసిన‌ప్ప‌టి నుంచి అభిమానులు మాస్ సాంగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఎప్పుడు ఈ పాట‌ను రిలీజ్ చేస్తార‌నేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular