Saturday, January 18, 2025
Homeసినిమామణిరత్నం కోసం కమల్ - రజనీ మనసు మార్చుకునేనా?

మణిరత్నం కోసం కమల్ – రజనీ మనసు మార్చుకునేనా?

రజనీకాంత్ – కమలహాసన్ ఈ ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలనే కోరిక ఎంతోమంది అభిమానులకు ఉంటుంది. చాలామంది దర్శకులు అందుకోసం చాలానే ప్రయత్నాలు చేశారు. రజనీతో .. కమల్ తో అత్యంత సన్నిహితంగా మెలిగే బడా నిర్మాతలు వారిని ఒప్పించడానికి గట్టిగానే ట్రై చేశారు. కానీ వారు మాత్రం ఆ విషయాలను గురించి ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఎవరి సినిమాలను వారు చేస్తూ ముందుకు వెళ్లారు. ఎవరి రికార్డులను వారు నమోదు చేస్తూనే వస్తున్నారు.

కమల్ – రజనీ ఇద్దరూ కూడా కెరియర్ ఆరంభంలో కలిసే నటించారు. బాలచందర్ ఈ ఇద్దరితో కలిసి హిట్ సినిమాలు చేశారు. ఒక స్థాయి వరకూ కమల్ – రజనీ కాంబినేషన్ ను సెట్ చేయడం తేలికగానే జరిగిపోయింది. ఇద్దరికీ కూడా తిరుగులేని క్రేజ్ వచ్చిన తరువాత మాత్రం వారు కలిసి నటించలేదు. ఇద్దరి పారితోషికాలలో ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారు? ఎవరి పాత్ర నిడివి ఎంత? ఎవరు బాగా చేశారు? వంటి అనవసరమైన చర్చలకు అవకాశం ఇవ్వకూడదని రజనీ – కమల్ కలిసే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అప్పటి నుంచి దానినే ఆచరిస్తూ వస్తున్నారు.

అయితే ఇప్పుడు ఆ ఇద్దరితో కలిసి మణిరత్నం ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో ‘నాయకుడు’ సినిమాతో కమల్ కీ .. ‘దళపతి’ మూవీతో రజనీకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు మణిరత్నం. ఆయన పట్ల రజనీకి .. కమల్ కి మంచి గౌరవ భావం ఉంది. బాలచందర్ తరువాత వారిద్దరూ అభిమానించే దర్శకుడు మణిరత్నం. ఆ నమ్మకంతోనే రెండు వైపుల నుంచి మణిరత్నం సంప్రదింపులు మొదలుపెట్టారనేది కోలీవుడ్ టాక్. మరి మణిరత్నం కోసం రజనీ .. కమల్ మనసు మార్చుకుంటారా? అనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్