Friday, March 20, 2026
HomeTrending Newsటిటిడికి ముస్లిం దంపతుల భారీ విరాళం

టిటిడికి ముస్లిం దంపతుల భారీ విరాళం

తిరుమల శ్రీవారిని హిందువులే కాకుండా అన్ని మతాల వారూ దర్శించుకుంటుంటారు.  కడపలోని వెంకటేశ్వర స్వామిని తమ ఇంటి అల్లుడిగా  ముస్లింలు భావిస్తారు. తాజాగా ఓ ముస్లిం కుటుంబం వడ్డీకాసుల వాడికి భూరి విరాళం ఇచ్చి వార్తల్లో నిలిచారు.

చెన్నైకి చెందిన సుబీనాబాను,అబ్దుల్‌ ఘనీ దంపతులు టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో దాతలు విరాళం చెక్కును టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.15 లక్షలు, ఇటీవల తిరుమలలో ఆధునీకరించిన శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో నూతన ఫర్నిచర్, వంటశాలలో పాత్రలకు రూ.87 లక్షలు విరాళంగా అందజేశారు.

Also Read: బ్రహంగారి పీఠాధిపతిగా వెంకటాద్రి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular