Sunday, January 19, 2025
HomeTrending NewsTelangana: పర్యావరణం.. అగ్రస్థానంలో తెలంగాణ- మంత్రి కేటీఆర్

Telangana: పర్యావరణం.. అగ్రస్థానంలో తెలంగాణ- మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచింది. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న వేళ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ సంస్థ సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ విడుదల చేసిన నివేదికలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అడవుల పెంపకం, మునిసిపల్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి అనేక పర్యావరణహిత కార్యక్రమాలను పరిగణలోకి తీసుకున్న సంస్థ, తెలంగాణ రాష్ట్రానికి అగ్రస్థానాన్ని కట్టబెట్టింది. తెలంగాణ రాష్ట్రానికి జాతీయస్థాయిలో పర్యావరణ రంగంలో ఈ గొప్ప గుర్తింపు లభించడం పట్ల మంత్రి కేటీ రామారావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో పరిఢవిల్లాలన్న బృహత్ సంకల్పంతో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రారంభించిన తన మానస పుత్రిక హరితహారం కార్యక్రమంతో పాటు అనేక పర్యావణహితమైన కార్యక్రమాలకు ఈ అరుదైన ఘనత దక్కడం పట్ల మంత్రి కే. తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరితహారంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా, అందులో భాగస్వాములైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తనదైన విధానాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని, ముఖ్యంగా పర్యావరణం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల ఫలితమే తెలంగాణ దేశంలో అగ్రస్దానంలో నిలిచేందుకు కారణమన్న కేటీఆర్, ఈ సందర్భంగా పలు అంశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పర్యావరణ విధ్వంసం నుంచి తెలంగాణ ప్రాంతం కోలుకునేలా తోలినాళ్లలోనే కెసిఆర్ గారు, దీర్ఘదృష్టితో ఈ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి, దాని అమలుకి చూపిన చంచలమైన కృషి వల్లనే ఈ ఘనత సాధ్యమైంది అన్నారు. భవిష్యత్తు తరాల కోసం హరించుకుపోయిన అడవులను పునరుద్ధరించి, రాష్ట్రంలో పచ్చదనాన్ని 22 శాతం నుంచి 33 శాతానికి పెంచడం లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, ప్రజల సహకారంతో ఇది ఒక ఉద్యమ రూపంలో కొనసాగిందన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం వలన అనేక సానుకూల ఫలితాలు అందుతున్న విషయాన్ని అనేక సంస్థలు పలుమార్లు గుర్తించిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మానవ ప్రయత్నంగా తెలంగాణ ప్రభుత్వం హరితహారంను చేపట్టిందని, గత తొమ్మిది సంవత్సరాలలో దాదాపు 273 కోట్ల మొక్కలను నాటమన్నారు. దాంతో 2015-16లో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా.. 2023 నాటికి అది 26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగిందన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ విస్తీర్ణంలో అడవులు 24.06 శాతంగా ఉన్నాయన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో 7.70 శాతం పచ్చదనం పెరిగిందని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొన్న విషయాన్ని కెటిఅర్ తెలిపారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్