Saturday, January 18, 2025
Homeసినిమాధనుష్ మూవీలో సీనియర్ హీరో?

ధనుష్ మూవీలో సీనియర్ హీరో?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. హైదరాబాద్ లో ధనుష్ ని డైరెక్టర్ శేఖర్ కమ్ముల, చిత్ర నిర్మాతలు కలుసుకున్నారు. షూటింగ్ ఎప్పుడు మొదలుపెత్తలనే దానిపై స్పష్టత వచ్చినట్లు తెలిసింది.  ఈ సినిమా ఇది భారీ మల్టీస్టారర్ అనే వార్త వినిపోస్తోంది. ఓ కీలకమైన పాత్ర కూడా సినిమాలో ఉందట. ఈ పాత్రకు కోలీవుడ్, బాలీవుడ్ లో బాగా పరిచయం ఉన్న సీనియర్ హీరోను సంప్రదించాలని భావిస్తున్నారు.  శేఖర్ కమ్ముల మాత్రం టాలీవుడ్ లేదా కోలీవుడ్ హీరోతో ఆ పాత్రను చేయించాలి అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే.. టీమ్ చర్చించుకున్నారు కానీ.. ఇంకా ఆ పాత్రను ఎవరితో చేయించాలి అనేది ఫిక్స్ కాలేదట.

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’ రిలీజ్ అయిన తరువాతే ధనుష్ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. అంతా సవ్యంగా జరిగితే. 2022 జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం

RELATED ARTICLES

Most Popular

న్యూస్