Wednesday, March 11, 2026
Homeసినిమాపాట చిత్రీకరణలో ‘వరుడు కావలెను’

పాట చిత్రీకరణలో ‘వరుడు కావలెను’

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ శౌర్య , రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై ఓ సందర్భోచిత గీతాన్ని నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో పాటు మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణతో త్వరలోనే షూటింగ్ పూర్తవుతుంది.

ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకాన్ని దర్శక నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. నాగశౌర్య, రీతువర్మలతో పాటు నదియా, మురళీశర్మ, వెన్నెల కిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్య దేవర నాగవంశి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular