Thursday, March 19, 2026
Homeసినిమామేజర్ ఉన్నికృష్ణన్ కు నివాళిగా వీడియో రిలీజ్

మేజర్ ఉన్నికృష్ణన్ కు నివాళిగా వీడియో రిలీజ్

Tribute to Major Sandeep:  అడివి శేష్ మొదటి పాన్ ఇండియా మూవీ ‘మేజర్‘ మే 27న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో వేసవి కానుక‌గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించబడింది. మలయాళంలో కూడా విడుదల కానుంది. మార్చి 15న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జయంతి.  26/11 సంఘ‌ట‌న హీరోగా నిలిచిన మేజ‌ర్‌ 45వ జ‌యంతి సందర్భంగా, మేజర్ బృందం అతని జీవితం పై హృదయపూర్వకమైన నివాళిని వీడియో రూపంలో తెలియ‌జేసింది.

వీడియో కేవలం మేజర్ జీవితంలోని వివిధ దశలను చూపడమే కాకుండా, ఆ పాత్రను అడివి శేష్‌ తో చిత్రీకరించిన మరపురాని సంఘటనలను కూడా చూపుతుంది. ఇందులో మేజర్‌కి తన తల్లితో ఉన్న ఆప్యాయత, సోదరితో అతని బంధం, స్నేహితులతో గ‌డిపిన అత్యుత్తమ క్షణాలు, శిక్షణా రోజులు, చివరకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌లో అధికారిగా అతని అనుభవాలను వివరిస్తుంది. చివ‌రి వ‌ర‌కు ఇమేజెస్‌లో మేజర్‌లోనూ, శేష్‌లోనూ మనకు పెద్దగా తేడాలు కనిపించవు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జ‌యంతి సందర్భంగా ఈ వీడియో ఒక సంపూర్ణ గుర్తింపుగా నిలుస్తుంది.

మేజర్  టీజర్‌పై భారీ అంచనాలు నెలకొనగా, మొదటి పాట `హృదయమా` సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. బహుభాషా చిత్రంగా రూపొందిన  మేజర్  చిత్రంలో మేజర్ సందీప్ బాల్యం, యుక్తవయస్సు, సైన్యంలో సంవత్సరాల నుండి వున్న‌ప్ప‌టి నుంచీ అతను మరణించిన ముంబై దాడి విషాద సంఘటనల వరకు అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను స్పృశిస్తుంది. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర పాత్ర‌లు పోషిస్తున్నారు. మహేష్ బాబు GMB ఎంటర్‌టైన్‌మెంట్‌, A+S మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular