Saturday, January 18, 2025
Homeసినిమా'టిల్లు క్యూబ్' కోసం స్టార్ హీరోయిన్! 

‘టిల్లు క్యూబ్’ కోసం స్టార్ హీరోయిన్! 

సిద్ధూ జొన్నలగడ్డ .. ఈ పేరు ఇప్పుడు యూత్ నోళ్లలో ఎక్కువగా నానుతోంది. తన సినిమాలలో ఎంటర్టైన్ మెంట్ ఎంతమాత్రం తగ్గదనే విషయం వాళ్లకి అర్థమైపోయింది. అదే విషయాన్ని ‘టిల్లు స్క్వైర్’ మరోసారి నిరూపించింది. దాంతో ఇప్పుడు ‘టిల్లు క్యూబ్’ పనిలో ఈ సినిమా టీమ్ ఉంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్టు ఉందని సిద్ధూ చెప్పడంతో, ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుందా అనే  ఆసక్తితో  అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా ఒక టాక్ అయితే వినిస్తోంది.

‘డీజే టిల్లు’ కోసం అప్పటికి ఎంతమాత్రం క్రేజ్ లేని నేహా శెట్టిని తీసుకున్నారు. ‘టిల్లు స్క్వైర్’ దగ్గరికి వచ్చేసరికి కాస్త క్రేజ్ ఉన్న అనుపమా పరమేశ్వరన్ ను ఎంపిక చేశారు. ఇప్పుడు ‘టిల్లు క్యూబ్’ కోసం ఎవరిని హీరోయిన్ గా తీసుకుంటారనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ సినిమా కోసం స్టార్ హీరోయిన్ ను తీసుకునే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. అంటే బడ్జెట్ పరంగా కూడా ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లే ఆలోచనలో ఉన్నారు. హీరోయిన్స్ జాబితాలో కొంతమంది పేర్లయితే వినిపిస్తున్నాయి.

‘డీజే టిల్లు’లో అందాల సందడి చేసిన నేహా శెట్టి, ‘టిల్లు స్క్వైర్’లో కూడా కనిపించింది. అది ఈ సినిమాకి ప్లస్ అయింది. అదే విధంగా ‘టిల్లు క్యూబ్’లో నేహాశెట్టి – అనుపమా ఇద్దరూ కూడా  మెరవనున్నారట. ప్రధానమైన నాయికగా స్టార్ హీరోయిన్ ను సెట్ చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ  సారి కథ ఫారిన్ లో నడుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం సిద్ధూ ‘బొమ్మరిల్లు’ దర్శకుడు భాస్కర్ తో ‘జాక్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత, ‘టిల్లు క్యూబ్’ సెట్స్ పైకి వెళుతుందన్న మాట.

RELATED ARTICLES

Most Popular

న్యూస్