Sunday, February 23, 2025
HomeTrending Newsతిరుపతి జూపార్క్‌లో విషాదం: సింహం దాడిలో యువకుడు మృతి

తిరుపతి జూపార్క్‌లో విషాదం: సింహం దాడిలో యువకుడు మృతి

తిరుపతి నగరంలోని ఎస్వీ జూపార్క్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. సేల్ఫీ మోజుతో ఓ యువకుడు నిబంధనలు ఉల్లంఘించి సింహం ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లడంతో అతడిపై సింహం క్రూరంగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది మిగిలిన పర్యాటకులను బైటకు పంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, సెల్ఫీ దిగడానికి ముందు సింహం ముందు సదరు యువకుడు తొడ కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సింహంతో పరాచికాలు ఆడి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని వారు వాపోతున్నారు.  సింహం దాడి నుంచి తప్పించుకునేందకు ఆ యువకుడు చెట్టు ఎక్కాడని కానీ సింహం ఎగిరి అతన్ని పట్టుకొని దాడి చేసిందని వారు వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్