Saturday, March 14, 2026
Homeసినిమాతిరుపతిలో  ‘ఆడ‌వాళ్లు మీకు జోహార్లు’ రిలీజ్ ఈవెంట్

తిరుపతిలో  ‘ఆడ‌వాళ్లు మీకు జోహార్లు’ రిలీజ్ ఈవెంట్

Grand Release Event: యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా నటించిన‌ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ‘ఆడ‌వాళ్లు మీకు జోహార్లు’. ఇందులో క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న నటించింది. స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ తిరుమ‌ల కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఎస్‌.ఎల్‌.వి.సినిమాస్ బ్యాన‌ర్ పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించారు. విభిన్న క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రం మార్చి 4న  రిలీజ్ కానుంది. ఇప్పుడు రిలీజ్ ఈవెంట్ డేట్‌ను మార్చి 2న సాయంత్రం 6 గంట‌ల‌కు తిరుప‌తిలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు మేక‌ర్స్‌ అధికారికంగా ప్ర‌క‌టించారు.

తిరుమ‌ల కిషోర్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమాను సిద్ధం చేశారు. రీసెంట్‌గా విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌. సీనియ‌ర్ హీరోయిన్స్ ఖుష్బూ, రాధికా శ‌ర‌త్ కుమార్‌, ఊర్వ‌శి ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. స‌రైన స‌క్స‌స్ కోసం ఎదురు చూస్తున్న శ‌ర్వానంద్ కు ఆడ‌వాళ్లు మీకు జోహార్లు ఆశించిన విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular