Friday, March 20, 2026
Homeసినిమాఆది సాయి కుమార్ కొత్త సినిమా టైటిల్ 'టాప్ గేర్'

ఆది సాయి కుమార్ కొత్త సినిమా టైటిల్ ‘టాప్ గేర్’

Gear Changed:  సాయి కుమార్ కుమారుడు ఆది తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆయన కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలు ఎంచుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిన ఆది సాయి కుమార్ తాజాగా మరో సినిమాను లైన్‌లో పెట్టేశారు. ఈ సినిమా పేరే టాప్ గేర్.

తాజాగా ఈ సినిమా టైటిల్ లాంచ్ హైదరాబాద్ లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. వేలాది మంది స్టూడెంట్స్ నడుమ ఈ టైటిల్ లోగో లాంచ్ చేయడం విశేషం. టైటిల్ లుక్ చూస్తుంటే.. ఈ సినిమాలో అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ చూపించబోతున్నారని స్పష్టమవుతోంది. ఈ సినిమా తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకం కానుందని హీరో ఆది సాయి కుమార్ చెప్పడం సినిమా పై అంచనాలు పెంచేసింది.

ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అన్ని హంగులతో ఈ టాప్ గేర్ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొని ఓ వైవిద్యభరితమైన కథతో రూపొందించనున్నారు. చిత్రానికి K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular