Sunday, January 19, 2025
Homeసినిమాఆది కొత్త సినిమా అనౌన్స్

ఆది కొత్త సినిమా అనౌన్స్

Aadi new project:  డిఫరెంట్ రేంజ్ లో, డిఫరెంట్ జానర్ సినిమాలు తీసిన ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో సిద్ధం అయ్యారు. హై బడ్జెట్ ఎంటర్టైనర్లతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 10 ని నిర్మాత ఈరోజు ప్రకటించారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయకుడు గా ఆది సాయికుమార్ నటిస్తున్నారు. ఫణి కృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది.
ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.. ”అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అద్భుతమైన కథతో ఫణికృష్ణ నన్ను సంప్రదించారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆది సాయికుమార్ ఈ సబ్జెక్ట్ కి సరిగ్గా సరిపోతారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి బాగా వస్తోంది. ఈ చిత్రానికి సరైన తారాగణం మరియు సాంకేతిక సిబ్బంది సెట్ అయ్యారు అని పేర్కొన్నారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ధృవన్ సంగీత దర్శకుడు. జి సత్య ఈ చిత్రానికి ఎడిటర్.
RELATED ARTICLES

Most Popular

న్యూస్