Saturday, January 18, 2025
Homeసినిమా‘ప్రేమ్ కుమార్’ పై అదే నా నమ్మకం: సంతోష్ శోభ‌న్‌

‘ప్రేమ్ కుమార్’ పై అదే నా నమ్మకం: సంతోష్ శోభ‌న్‌

కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫ‌రెంట్ మూవీస్‌తో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో సంతోష్ శోభ‌న్ తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’.  ల‌వ్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఆగ‌స్ట్ 18న‌ రిలీజ్ అవుతోంది. రైట‌ర్‌ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివప్రసాద్ పన్నీరు దీన్ని నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లు . కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మూవీ ప‌రిచ‌య వేదిక కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

రోల్ రైడా మాట్లాడుతూ… ‘‘నాకు డైరెక్ట‌ర్ అభిషేక్ మ‌హ‌ర్షితో 2012 నుంచి ప‌రిచ‌యం ఉంది. ఈ సినిమాలో ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ చేశాను. ఇందులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. నా పాట‌కు కాస‌ర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు. ధ్రువ‌న్‌తో క‌లిసి వ‌ర్క్ చేశాను’’ అన్నారు.

హీరో సంతోష్ శోభ‌న్ మాట్లాడుతూ… ‘‘అభిషేక్ మహర్షి, శివ ప్రసాద్లకు థాంక్స్. వాళ్లు నమ్మితేనే సినిమా ఇంత వ‌ర‌కు వ‌చ్చింది. నిజానికి నా సినిమాల్లో అభిషేక్ నటించాడు. త‌ను అప్పుడు డైరెక్ట‌ర్ అవుతాడ‌ని అనుకోలేదు. ఈ సినిమా త‌ర్వాత త‌నెంత మంచి డైరెక్ట‌రో అంద‌రికీ తెలుస్తుంది. భ‌విష్య‌త్తులో హ్యూమ‌ర్‌కి అభిషేక్ ఓ బ్రాండ్ అవుతాడ‌ని న‌మ్మ‌కంగా ఉన్నాను. కామెడీ సినిమా చేయ‌టం అంత గొప్ప విష‌యం కాదు.. కానీ త‌ను గొప్ప‌గా చేశాడు. శివ నిర్మాత 50 కాదు.. 150 సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. రోల్ రైడా, ధ్రువ‌న్‌, కాస‌ర్ల శ్యామ్ ఇచ్చిన ధావ‌త్ సాంగ్ చాలా బావుంది. అలాగే సినిమాలో న‌టించిన న‌టీన‌టుల‌కు, టెక్నీషియ‌న్స్‌కు థాంక్స్‌. రాశీసింగ్, రుచిత‌, అశోక్ కుమార్‌, ప్ర‌భావ‌తిగారికి ధ‌న్య‌వాదాలు. ఈ సినిమా మిమ్మ‌ల్ని రెండు గంటల పాటు మ‌న‌స్ఫూర్తిగా న‌వ్విస్తుందని న‌మ్ముతున్నాను. ఆగ‌స్ట్ 18న థియేట‌ర్స్‌లో క‌లుద్దాం’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్