స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యుడీషియల్ రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మరో రెండు వారాలపాటు పొడిగించారు. ప్రస్తుతం ఉన్న రిమాండ్ గడువు నేటితో ముగుస్తుండడంతో బాబును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వర్చువల్ గా జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. తన ఆరోగ్యం, భద్రతపై జడ్జి ఎదుట బాబు ప్రస్తావ్బించారు. జైలులో తన భద్రతపై అనుమానాలున్నాయని చెప్పారు. దీనిపై లిఖిత పూర్వకంగా చెప్పాలని జడ్జి సూచిస్తూ… బాబు లేఖను తనకు అందజేయాలని ఆదేశించారు. ఈ కేసు విచారణ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న విషయాన్ని చంద్రబాబుకు చెబుతూ రిమాండ్ ను నవంబర్ 1 వరకూ పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
చంద్రబాబు ఇప్పటికే 40 రోజులపాటు జైల్లో ఉన్నారని, ఆరోగ్య సమస్యల దృష్ట్యా రెండు వారాలపాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు సిద్దార్థ్ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. బాబు ఆరోగ్య పరిస్థితిపై మెమో దాఖలు చేశామని జడ్జి దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై ప్రభుత్వ వైద్యుల నుంచి వివరాలు తెప్పించుకుంటామని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు.
బాబు ఆరోగ్యం పరిస్థితిపై జైలు అధికారులను అడిగి వివరాలు లుసుకున్న న్యాయమూర్తి, ఎప్పటికప్పుడు తనకు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.