Monday, February 24, 2025
HomeTrending Newsపెద్దిరెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం

పెద్దిరెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం

రాష్ట్ర విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, అయన కుమారుడు, రాజంపేట ఎంపి మిథున్ రెడ్డిలకు పెను ప్రమాదం తప్పింది.   వీరు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు తమ కుటుంబసభ్యులతో కలిసి పుంగనూరు నుంచి వీరబల్లి బయలుదేరారు.  రాయచోటి రింగు రోడ్డులో మిథున్ రెడ్డి  కాన్వాయ్ లోని రెండు కార్లు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.  వీటికి ముందు కారులో  మంత్రి, ఎంపి  ఉన్నారు.

ఈ ప్రమాదంలో మిథున్ రెడ్డి  గన్ మెన్లు, వ్యక్తిగత కార్యదర్శి గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్