సీనియర్ నటుడు చంద్రమోహన్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. కొంతకాలంగా హృద్రోగ సంబంధ వ్యాధితో బాధపడుతున్న చంద్ర మోహన్ హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం 9.45 గంటల ప్రాంతంలో మరణించారు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
1966లో’ రంగులరాట్నం’ ద్వారా సినీ జీవిటం ప్రారంభించిన చంద్రమోహన్ ఇప్పటి వరకూ 932 సినిమాల్లో నటించారు. ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో 1942 మే 23న జన్మించిన ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్.
తన కెరీర్ లో హీరోగా, సహాయ నటుడిగా, కమెడియన్ గా ఎన్నో పత్రాలు పోషించారు. తన కెరీర్ మొదట్లో హీరోయిన్ లకు లక్కీ హీరోగా పేరు సంపాదించారు. ఆయనతో కలిసి తొలి సినిమాలో నటించిన హీరోయిన్లు శ్రీదేవి, జయప్రద, ప్రభ సహా ఎందరో ఆ తర్వాత అత్యున్నత స్థాయికి చేరుకున్నారు.
చంద్రమోహన్ అంత్యక్రియలు హైదరాబాద్ లో సోమవారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు.