Sunday, February 23, 2025
Homeసినిమాఆఖరి షెడ్యూల్ లో ‘ఆచార్య’

ఆఖరి షెడ్యూల్ లో ‘ఆచార్య’

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ విషయాన్ని తెలియచేస్తూ.. ఇందులో సిద్ధ పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ నడిచొస్తున్న స్టిల్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. అలాగే త్వరలోనే ఎగ్జైటింగ్ అప్ డేట్ ఇవ్వనున్నట్టుగా తెలియచేసింది.

ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తే.. చరణ్ సరసన పూజా హేగ్డే నటించింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీనికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక రిలీజ్ విషయానికి వస్తే.. దసరా కానుకగా అక్టోబర్ లో ఆచార్య చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. షూటింగ్ పూర్తైన తర్వాత ఆచార్య విడుదల ఎప్పుడు అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్