Saturday, January 18, 2025
Homeసినిమాయూట్యూబ్ ను షేక్ చేస్తున్న చిరు ‘లాహే’

యూట్యూబ్ ను షేక్ చేస్తున్న చిరు ‘లాహే’

మెగాస్టార్ చిరంజీవి – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోష్తున్నారు. చిరు సరసన కాజల్ నటిస్తే.. చరణ్‌ సరసన పూజా హేగ్డే నటిస్తోంది. ఈ క్రేజీ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని ‘లాహే లాహే’ పాట విడుదలైనప్పటినుండి  యూట్యూబ్‌ లో ట్రెండింగ్ గా నిలుస్తూ వస్తోంది. తాజాగా ఈ లిరికల్‌ వీడియో సాంగ్‌ మరో మైలురాయిని చేరుకుంది. 60 మిలియన్‌ వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.

హారిక నారాయణ్‌, సాహితి చాగంటి ఈ సాంగ్‌ను పాడారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ జూలై రెండో వారంలో ఉంటుందని.. కేవలం 12 రోజుల షూటింగ్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉందని తెలిసింది. షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ‘ఆచార్య’ విడుదల ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ వస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్