Sunday, January 19, 2025
Homeసినిమామంగళవారం ఆచార్య ట్రైల‌ర్ రిలీజ్

మంగళవారం ఆచార్య ట్రైల‌ర్ రిలీజ్

Acharya Trailer: మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ, క్రేజీ మూవీ ఆచార్య‌. ఈ చిత్రానికి బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తే.. చ‌ర‌ణ్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టించింది. ఈ క్రేజీ మూవీ ఏప్రిల్ 29న వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. అయితే.. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్స్ లో స్పీడు పెంచారు.

ఈ మూవీ ట్రైల‌ర్ ను ఏప్రిల్ 12న విడుద‌ల చేయ‌నున్న‌ట్టుగా ఈరోజు అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్ మెంట్ తో పాటుగా ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ డేట్ ను అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌నున్నారు. చిరు, చ‌ర‌ణ్ క‌లిసి చేసిన సినిమా కావ‌డంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండ‌స్ట్రీలోనూ భారీగా అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆచార్య ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.

Also Read : ఆచార్య ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఎప్పుడు? ఎక్క‌డ‌?

RELATED ARTICLES

Most Popular

న్యూస్