Sunday, March 15, 2026
Homeసినిమాఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ ని ఆకట్టుకునేనా?

ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ ని ఆకట్టుకునేనా?

ఒకప్పుడు సీనియర్ స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి హీరోలు రావడానికి అభిమానులు ఒప్పుకునేవారుగానీ .. హీరోయిన్లు రావడానికి ఎంతమాత్రం ఇష్టపడేవారు కాదు. స్టార్ హీరోల వారసులుగా వాళ్ల తనయులు మాత్రమే తెరపైకి రావాలి .. కూతుళ్లు రావడానికి అవకాశమే ఉండేది కాదు. కొంతమంది సీనియర్ స్టార్ హీరోల కూతుళ్లకు హీరోయిన్ గా చేయాలని ఉన్నప్పటికీ, అందుకు పరిస్థితులు అనుకూలించని కారణంగా వేరే ప్రొఫెషన్ వెతుక్కున్నారు. ఇదే పద్ధతి చాలా కాలంగా నడుస్తూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ట్రెండ్ పేరుతో అభిమానుల ఆలోచనా విధానం కూడా మారిపోయింది.

కోలీవుడ్ విషయానికే వస్తే కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ తన కెరియర్ ను తీసుకుని వెళ్లింది. ఇక శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆ తరువాత విలన్ వేషాలకు కేరాఫ్  అడ్రెస్ గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె డేట్స్  దొరకడమే కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలోనే యాక్షన్ కింగ్ అనిపించుకున్న అర్జున్ కూడా తన కూతురు ఐశ్వర్య హీరోయిన్ కావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా ఐశ్వర్య తమిళ తెరకి 2013 లోనే హీరోయిన్ గా పరిచయమైంది.

తన కూతురుని హీరోయిన్ గా నిలబెట్టే విషయంలో అర్జున్ మరో అడుగు ముందుకేశాడు. తమిళ .. కన్నడ భాషల్లో తన దర్శక నిర్మాణంలోనే ఐశ్వర్యతో సినిమాలు చేసిన ఆయన, ఇప్పుడు ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాలో విష్వక్సేన్ హీరో. రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా కోసం అర్జున్ భారీ బడ్జెట్ కేటాయించడం విశేషం. తమిళ .. కన్నడ భాషల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేయకుండా ఐశ్వర్య టాలీవుడ్ పై దృష్టి పెట్టడం విశేషం. గ్లామర్ విషయంలో ఢోకా లేకపోయినప్పయికీ, ఇక్కడి పోటీని తట్టుకుని నిలబడే ఆలోచన  ఉందా? లేదంటే అవకాశం ఉంది కాబట్టి అలా పలకరించి వెళ్లిపోతుందా? అనేది చూడాలి.

Also Read : పవర్ స్టార్ క్లాప్ తో విశ్వక్ చిత్రం ప్రారంభం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular