Saturday, January 18, 2025
Homeసినిమాకోలీవుడ్ నుంచి తెలుగుతెరపైకి మరో హారర్ థ్రిల్లర్!

కోలీవుడ్ నుంచి తెలుగుతెరపైకి మరో హారర్ థ్రిల్లర్!

తమిళంలో హీరో భరత్ గురించి తెలియనివారు ఉండరు. ఎందుకంటే చాలాకాలం క్రితం అతను చేసిన ‘ప్రేమిస్తే’ను ఇంతవరకూ ఎవరూ మరిచిపోలేదు. ఆ సినిమా హిట్ తరువాత అతను చాలా సినిమాలు చేశాడు. అయితే తెలుగు ప్రేక్షకులు అతనిని గుర్తుపెట్టుకున్నది ‘స్పైడర్’ సినిమాలోనే. మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా చేసిన ఈ సినిమాలో, విలన్ కి తమ్ముడిగా భరత్ మెప్పించాడు. అతను హీరోగా రూపొందిన మరో సినిమానే ‘మిరల్’.

శక్తివేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, భరత్ సరసన నాయికగా వాణి భోజన్ అలరించనుంది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను ఇక్కడ విడుదల చేయనున్నారు. రీసెంటుగా వదిలిన ట్రైలర్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ట్రైలర్ ద్వారానే అసలు కథను చెప్పడానికి టీమ్ ప్రయత్నించింది. దాంతో కంటెంట్ పై అందరిలో ఉత్కంఠ పెరుగుతోంది.

ఇది రోడ్ నేపథ్యంలో జరిగే ఒక థ్రిల్లర్ అనే విషయం అర్థమవుతోంది. హీరో తన ఫ్యామిలీతో కలిసి ఒక రాత్రివేళ కారులో వెళుతూ ఉండగా, ఓ నిర్మానుష్య ప్రదేశంలో కారు ట్రబుల్ ఇస్తుంది. అటుగా వస్తున్న ఒక వ్యక్తి, ఆ ప్రదేశం మంచిది కాదనీ, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపొమ్మని వాళ్లకు చెబుతాడు. దాంతో అక్కడి నుంచి బయటపడటానికి వాళ్లు ప్రయత్నిస్తూ ఉండగానే ఓ భయంకరమైన సంఘటన జరుగుతుంది. ఆ క్షణం నుంచి వాళ్లను ఒక ‘మాస్క్’ వెంటాడుతూ ఉంటుంది. ఆ మాస్క్ ఎవరిది? దానివెనుక దాగున్న నిజం ఏమిటి? అనేది కథ.

RELATED ARTICLES

Most Popular

న్యూస్