Sunday, March 8, 2026
Homeసినిమాప్రముఖ నటుడు శరత్ కుమార్ కు తీవ్ర అస్వస్థత

ప్రముఖ నటుడు శరత్ కుమార్ కు తీవ్ర అస్వస్థత

ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డయేరియాతో డీహైడ్రేషన్ కు గురైన ఆయన ప్రస్తుతం చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి తమిళ సినీ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. శరత్‌ కుమార్‌ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేస్తున్నారు. శరత్‌ కుమార్ త్వరగా కోలుకుని త్వరలోనే ఇంటికి రావాలని సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. శరత్ కుమార్‌కు డిసెంబర్ 2020లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, ఈ విషయాన్ని ఆయన భార్య రాధిక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

శరత్‌కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే.. తనకి ఎటువంటి లక్షణాలు కనిపించలేదు కానీ మంచి వైద్యుల పర్యవేక్షణలో జాగ్రత్తగా చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అందజేస్తామని పేర్కొంటూ ట్వీట్ చేశారు రాధిక. ఇదే విషయాన్ని ఆయన కుమార్తె ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ప్రకటించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారని ఆమె తెలిపారు. అయితే.. శ‌ర‌త్ కుమార్‌కు ప్రాణాపాయం ఏమీ లేద‌ని వైద్యులు వెల్ల‌డించ‌డంతో ఆయ‌న కుటుంబ స‌భ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular