Friday, March 20, 2026
Homeసినిమాపెళ్లి వార్తల పై క్లారిటీ ఇచ్చిన తరుణ్

పెళ్లి వార్తల పై క్లారిటీ ఇచ్చిన తరుణ్

టాలీవుడ్ లో బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో అనేక సినిమాలు చేశారు. బాక్సాఫీస్ దగ్గర ఎన్నో విజయాలు సాధించారు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. అయితే.. తరుణ్ కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇదిలా ఉంటే..
తరుణ్ అవివాహితుడు కావడంతో ఎప్పటికప్పుడు ఆయన వివాహం త్వరలో జరగబోతుందని వార్తలు తెర మీదకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా తరుణ్ వివాహం ఫిక్సయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

దీంతో ప్రచారంలో ఉన్న వార్త నిజమా..? కాదా..? అనేది ఆసక్తిగా మారింది. ప్రచారంలో ఉన్న వార్త పై హీరో తరుణ్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ తరుణ్ ఏమన్నారంటే.. తన పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు అని తేల్చి చెప్పారు. నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే.. నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతానని, తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular