Monday, February 24, 2025
Homeసినిమానటుడు ఉత్తేజ్‌ కు సతీవియోగం

నటుడు ఉత్తేజ్‌ కు సతీవియోగం

ప్రముఖ నటుడు ఉత్తేజ్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆమె బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఉత్తేజ్‌ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి కీలక పాత్ర పోషిస్తూ ఉండేవారు. ఉత్తేజ్‌కు స్థాపించిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణ బాధ్యతలు ఆమె నిర్వర్తించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్‌, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

విషయం తెలుసుకున్న చిరంజీవి, ప్రకాశ్‌రాజ్‌, జీవిత రాజశేఖర్‌ ఆస్పత్రికి చేరుకుని ఉత్తేజ్‌ని పరామర్శించారు. ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటించారు.  ఉత్తేజ్-పద్మావతి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, సినీ, సంగీతంపై అభిమానంతో పిల్లలకు చేతన, పాట అని పేర్లు పెట్టుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్