Saturday, January 18, 2025
Homeసినిమావిజయ్ దేవరకొండకి ఇప్పుడు హిట్టు చాలా అవసరమే! 

విజయ్ దేవరకొండకి ఇప్పుడు హిట్టు చాలా అవసరమే! 

విజయ్ దేవరకొండ ఒక ఉద్యమంలా.. ఉప్పెనలా తెలుగు తెరపైకి దూసుకొచ్చాడు. తన యాటిట్యూడ్ తో యూత్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఆ తరువాత వచ్చిన రెండు మూడు సినిమాలు ఆయనకి స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. ఆ స్టార్ డమ్ ను కాపాడుకునే దశలోనే ఆయనను పరాజయాలు పలకరించడం మొదలైంది. అప్పటి నుంచి ఆయన సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ సతమతమవుతూనే ఉన్నాడు. అయితే ఆయనకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదనే చెప్పాలి.

ఇప్పుడు విజయ్ దేవరకొండ నుంచి రావడానికి ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రెడీ అవుతోంది. రేపు ఈ సినిమా భారీ స్థాయిలో థియేటర్లలో దిగిపోనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి, పరశురామ్ దర్శకత్వం వహించాడు. గతంలో విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబినేషన్లో వచ్చిన ‘గీతగోవిందం’ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. అందువలన ఈ సారి అదే తరహా కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా కనిపించనుంది.

ఈ సినిమాపై విజయ్ దేవరకొండ గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు తనకి హిట్ చాలా అవసరం.. ఆ మాట కొస్తే అత్యవసరమనే అనాలి. కరోనాకి ముందు.. ఆ తరువాత కూడా విజయ్ దేవరకొండకి ఇంతవరకూ హిట్ పడలేదు. ఆయన సక్సెస్ ను చూసి చాలా కాలమే అయింది. అందువలన ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ ను బట్టి చూసుకుంటే, ఈ సినిమా విజయాన్ని నమోదుచేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్