Monday, January 20, 2025
HomeసినిమాAthulya Ravi: మరో ఛాన్స్ కోసమే 'అతుల్య' వెయిటింగ్! 

Athulya Ravi: మరో ఛాన్స్ కోసమే ‘అతుల్య’ వెయిటింగ్! 

టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో కొంతమంది కొత్త హీరోయిన్స్ పరిచయమయ్యారు. ఆషిక రంగనాథ్ .. అతుల్య రవి వంటివారు గ్లామర్ పరంగా యూత్ ను ఆకట్టుకున్నారు. అయితే అందం .. అభినయం పరంగా మంచి మార్కులు పడినప్పటికీ, సక్సెస్ ను అందుకోలేకపోయారు. తెలుగులో చేసిన తొలి ప్రయత్నం వారిని నిరాశ పరిచింది. ఒక సినిమా ఫెయిల్యూర్ లో హీరోయిన్ పాత్ర పెద్దగా ఉండదు. కానీ వారి కెరియర్ పై ఫస్టు ఎఫెక్టు పడుతూ ఉంటుంది.

అలాంటి ఎఫెక్ట్ ‘మీటర్’ సినిమాతో ‘అతుల్య రవి’పై పడింది. అతుల్య కోయంబత్తూర్ బ్యూటీ. తమిళ  సినిమాతో 2017లోనే వెండితెరకి పరిచయమైంది. అప్పటి నుంచి ఆమె అక్కడ వరుస సినిమాలు చేస్తూనే వస్తోంది. క్రితం ఏడాదిలో కూడా తమిళంలో ఆమె మూడు సినిమాలు చేసింది. యూత్ లో తన క్రేజ్ ను పెంచుతూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ‘మీటర్’ సినిమాతో తెలుగు నుంచి ఆమెకి ఆఫర్ వెళ్లింది. కిరణ్ అబ్బవరం జోడీగా ఆమె చేసిన ఈ సినిమా, ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. గ్లామర్ పరంగా యూత్ ను ఆకట్టుకున్నప్పటికీ, సినిమా హిట్ కాకపోవడంతో సహజంగానే అతుల్య అవకాశాల కోసం వెయిట్ చేయవలసి వస్తోంది. తెలుగులో సరైన హిట్ పడితే అతుల్య కెరియర్ గ్రాఫ్ పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి మరో ఛాన్స్ కోసమే అతుల్య ఎదురుచూస్తోంది. మరి ఇప్పుడున్న పోటీలో ఇంతమంది కథానాయికలను దాటుకుని ఆమె వరకూ ఒక ఛాన్స్ వెళ్లడం కొంచెం కష్టమే. మరి అతుల్య ఏం చేస్తుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్