Tuesday, March 17, 2026
HomeసినిమాHari Teja: నటి హరితేజ విడాకులు ...?

Hari Teja: నటి హరితేజ విడాకులు …?

ఈ నడుమ సెలబ్రిటీలు వరుసగా విడాకులు తీసుకుంటున్నారు. ఏళ్లుగా సంసారం చేసుకుంటున్న వారు కూడా సడెన్ గా విడిపోతున్నామని ప్రకటించి ఫ్యాన్స్ కు షాక్ లు ఇస్తున్నారు. ఇప్పుడు మరో నటి కూడా ఇదే బాట పడుతుందనే ప్రచారం జరుగుతోంది. ఆమె ఎవరో కాదు నటి హరితేజ. సినీ ప్రపంచంలో ఇటీవలి కాలంలో విడాకుల వార్తలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో హరితేజ చేరింది. బుల్లితెర ద్వారా గ్లామర్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన హరితేజ… తన టాలెంట్, గ్లామర్ తో అనతి కాలంలోనే సినీపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హరితేజ బిజీగా ఉంది. బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా హరితేజ సందడి చేసింది.

2015లో దీపక్ అనే కన్నడ వ్యక్తిని హరితేజ పెళ్లాడింది. వీరికి భూమి అనే కూతురు ఉంది. తాజాగా తన భర్తకు హరితేజ విడాకులు ఇస్తోందనే వార్త బాగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఆమె ముచ్చటించే సందర్భంలో కూడా ఈ విషయం గురించి ఆమెను చాలా మంది డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె విడాకుల అంశంపై స్పందించింది. ఒక నాలుగు రోజులు సోషల్ మీడియాలో కనిపించపోవడంతో ఏవేవో రాసేస్తున్నారని మండిపడింది. తాను, తన భర్త అన్యోన్యంగానే ఉన్నామని చెప్పింది. తన భర్తతో ఉన్న ఫొటోను షేర్ చేసింది. మరోవైపు తన స్నేహితులతో కలిసి హరితేజ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తోంది. కూతురుని తన తల్లి వద్ద విడిచిపెట్టి ఆమె ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular