Saturday, January 18, 2025
Homeసినిమానేహా శెట్టి దూకుడు పెంచిందే! 

నేహా శెట్టి దూకుడు పెంచిందే! 

టాలీవుడ్ కి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతూనే ఉంటారు. అందువలన ఇక్కడ మిగతావారిని దాటుకుని ఒక అవకాశం రావడం అంత తేలికైన విషయంగా కనిపించదు. గ్లామర్ తో పాటు అంతో ఇంతో నటన తెలిసి ఉన్నప్పటికీ, అదృష్టం కూడా కలిసి రావాలి. అలా అదృష్టం కలిసొచ్చిన భామల్లో ఇప్పుడు నేహా శెట్టి పేరును కూడా చేర్చుకోవాలేమో. నేహా శెట్టి 2018లో ‘మెహబూబా’  సినిమాతో పరిచయమైంది. ఆకాశ్ పూరి జోడీగా తన నాజూకుదనంతో ఆకట్టుకుంది. అయితే కంటెంట్ పరంగా ఆ సినిమా యూత్ ను మెప్పించలేకపోయింది.

అయినా గ్లామర్ పరంగా యూత్ ను ఆకట్టుకోవడం వలన, నేహాకి సందీప్ కిషన్ సరసన ‘గల్లీ రౌడీ’ సినిమాలో ఛాన్స్ దక్కింది. ఆ సినిమా కూడా ఆమె కెరియర్ కి పెద్దగా హెల్ప్ కాలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమెకి ‘డీజే టిల్లు’ సినిమా పడింది. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. చిన్న సినిమానే అయినా పెద్ద సక్సెస్ ను అందుకుంది. నేహా శెట్టి మరింత గ్లామరస్ గా కనిపిస్తూ మరిన్ని మార్కులు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ లోను అతిథి పాత్రలో మెరవనుంది.

ఇక నేహా శెట్టి చేసిన ‘బెదురులంక 2012’ ఈ రోజునే విడుదల. కార్తికేయ సరసన నాయికగా ఆమె ఈ సినిమాలో నటించింది. క్లాక్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విలేజ్ నేపథ్యంలో నడుస్తుంది. కామెడీతో పాటు రొమాన్స్ కి కూడా ప్రాధాన్యతని ఇచ్చారనే విషయం ట్రైలర్ వలన అర్థమవుతోంది. ఆ తరువాత రానున్న ‘రూల్స్ రంజన్’ సినిమాలో కిరణ్ అబ్బవరం జోడీగా .. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో విష్వక్సేన్ జోడీగా ఆమె మెరవనుంది. మొత్తానికి వరుస సినిమాలతో నేహా శెట్టి దూకుడు మీదే ఉందని చెప్పాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్