Wednesday, February 26, 2025
HomeసినిమాPragati Shrivatsav: హీరోయిన్ గా బిజీ అవుతున్న ప్రగతి శ్రీవాత్సవ! 

Pragati Shrivatsav: హీరోయిన్ గా బిజీ అవుతున్న ప్రగతి శ్రీవాత్సవ! 

టాలీవుడ్ లోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ దిగిపోతూనే ఉంటారు. అందువలన ఇక్కడ పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక అవకాశం చేజిక్కుంచుకోవడం ఇక్కడ అనుకున్నంత తేలిక కాదు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు, నిరూపించుకోవడం కూడా అంత సులభం కాదు. ప్రాజెక్టు పరంగా అంతా ఓకే అయినప్పటికీ అదృష్టం కలిసొస్తేనే సక్సెస్ వస్తుంది. సక్సెస్ ను అందుకున్నప్పుడే ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు.

అలా ‘పెదకాపు 1’ సినిమాతో ప్రేక్షకులు తనని గుర్తుపెట్టుకునేలా చేయగలిగిన హీరోయిన్ గా ‘ప్రగతి శ్రీవాత్సవ’ కనిపిస్తుంది. రీసెంట్ గా థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా ఆమె సందడి చేసింది. తన పాత్రలో చాలా సహజంగా ఇమిడిపోతూ ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది. ఈ సినిమా నుంచే అందరి దృష్టి ఈ అమ్మాయి వైపుకు వెళ్లింది. ఈ సినిమా ఫలితం ఏదైనా తనకి మంచి పేరును తెచ్చిపెట్టింది. దాంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.

అయితే ఇంతకుముందే తాను ‘మనుచరిత్ర’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం .. అందులో మెయిన్ లీడ్ కాకపోవడం వలన ఆడియన్స్ గుర్తుపెట్టుకోలేదు. ఇక త్వరలో ఆమె హీరోయిన్ గా ‘గం గం గణేశా’ విడుదల కానుంది. ఈ సినిమాలో ఆమె ఆనంద్ దేవరకొండ జోడీగా కనిపించనుంది. ఈ సినిమా సక్సెస్ అయితే ఆమె జోరు మరింత పెరిగే అవకాశం ఉంది. చూడాలి మరి ఈ భామ ప్రస్తుతం ఉన్న పోటీని తట్టుకుని ఎంతవరకూ నిలబడుతుందనేది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్