Saturday, January 18, 2025
Homeసినిమాప్రియా ప్రకాశ్ వారియర్ ఇలా చేసిందేంటబ్బా! 

ప్రియా ప్రకాశ్ వారియర్ ఇలా చేసిందేంటబ్బా! 

ఒక సినిమా విడుదలకి ముందే హీరోయిన్ కి ఒక రేంజ్ లో క్రేజ్ వచ్చేయడం చాలా తక్కువమంది విషయంలో జరుగుతూ ఉంటుంది. తన ఫస్టు సినిమా రిలీజ్ కోసం యూత్ అంతా ఎంతో ఆత్రంగా వెయిట్ చేసేలా చేయడం కూడా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన సంఘటన ప్రియా ప్రకాశ్ వారియర్ విషయంలో జరిగింది. ‘ఒరు అదార్ లవ్’ రిలీజ్ కి ముందు వదిలిన ట్రైలర్ లో ఆమె చేసిన కనుబొమల విన్యాసానికీ .. ఇచ్చిన ఫ్లైయింగ్ కిస్ కి కుర్రాళ్లంతా పొలోమంటూ మనసులు పారేసుకున్నారు.

ఈ బ్యూటీ వలన ఆ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. మలయాళంతో పాటు ఇతర భాషల్లోను ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమాలో ఆమె చేసిన ఆ ఒక్క మేజిక్ తప్ప మరేమీ లేకపోవడంతో కుర్రాళ్లంతా నిరాశ చెందారు. సినిమా పరాజయం దిశగా పరుగులు పెట్టింది.  ఆ సినిమా రిలీజ్ కి ముందే ప్రియా వరుస ప్రాజెక్టులను ఒప్పుకుని ఉంటే బాగుండేది. కానీ ఆ సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయడమే ఆమె చేసిన పెద్ద పొరపాటు అయింది. అక్కడే కెరియర్ పరంగా ఆమె స్పీడ్ తగ్గింది.

ఆ తరువాత తెలుగులోను ప్రియా ఒకటి రెండు సినిమాలు చేసింది. ఆ సినిమాలు కూడా ఆమె కెరియర్ కి పెద్దగా హెల్ప్ కాలేదు. అయినా ఆమె అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ మాత్రం యూత్ లో ఉంది. అలాంటి ప్రియా ప్రకాశ్ ‘బ్రో’ సినిమాలో ఉండటంతో, ఆమె పవన్ సరసనగానీ, సాయితేజ్ జోడీల్లో ఒకరిగా గాని చేసి ఉండొచ్చని ఆడియన్స్ ఒక చిన్న ఆశను పెట్టుకున్నారు. కాస్త ఆలస్యమైనా మంచి ఛాన్స్ నే కొట్టేసిందని అనుకున్నారు. కానీ తీరా సినిమాకి వెళితే, ఆమె సాయితేజ్ పెద్ద చెల్లెలి పాత్రలో కనిపించడం ప్రేక్షకులకు నిరాశను కలిగించింది. ఒకప్పుడు ఎంతో క్రేజ్ ఉన్న ప్రియా, ఇలా చెల్లెలి పాత్రలో కనిపించడాన్ని కుర్రాళ్లు ఇంకా జీర్ణించుకునే పనిలోనే ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్